డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదంపై కేసు.. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు

20 Jan, 2023 09:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్ డెక్కన్‌ మాల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి భవనం యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించారు.  ఈ ఘటనలో నలుగురిని రెస్క్యూ చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  

మరోవైపు మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వసీం, జునైద్, జహీర్ కోసం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి వెళ్లారు. బిల్డింగ్ ఓనర్‌ను కూడా లోపలికి తీసుకెళ్లారు. నిన్న అగ్ని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన ఫైర్ సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారంతా నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.

ఇంకా అదుపులోకి రాని మంటలు..
డెక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భవనం దగ్గరికి ఎవరినీ అనుమతించడం లేదు. సెల్లార్లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు.  పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భవన యజమానిపై చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు.  మంటల్లో కాలిపోయిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ  ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు.
చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే!

మరిన్ని వార్తలు