సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం: అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీ 

7 Aug, 2021 10:56 IST|Sakshi

పట్టుపోగులతో చేనేత మగ్గంపై తయారు

సిరిసిల్ల నేత కళాకారుడి నైపుణ్యం

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. తన సాంచాల షెడ్డులో పట్టుపోగులతో రెండున్నర మీటర్ల షర్ట్‌ బట్ట, రెండు మీటర్ల పొడవైన లుంగీని నేశాడు. తర్వాత రెండున్నర మీటర్ల వస్త్రంతో షర్ట్‌ను కుట్టించాడు. లుంగీ, షర్ట్‌.. రెండూ అగ్గిపెట్టెలో ఇమిడి పోవడం విశేషం.

లుంగీ 140 గ్రాములు, షర్ట్‌ 100 గ్రాముల బరువు ఉన్నాయి. హరిప్రసాద్‌ వారం పాటు శ్రమించి వీటిని తయారు చేశాడు. శనివారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని.. శుక్రవారం వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు. గతంలో కూడా హరిప్రసాద్‌ సూక్ష్మ మరమగ్గం, మరమగ్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చిత్రాలను నేశాడు.   

మరిన్ని వార్తలు