కేటీఆర్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

28 Jul, 2021 10:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ దంపతుల పంచలోహ చిత్రపటాన్ని కేటీఆర్‌కు.. శ్రీనివాస్‌గౌడ్, తన కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితతో కలిసి బహూకరించారు. ప్రముఖ శిల్పులు మూణ్ణెళ్ల పాటు కృషిచేసి దీన్ని రూపొందించినట్లు శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు