ఫ్రిజ్‌లున్నా సరే మట్టికుండవైపే మొగ్గు

18 Mar, 2021 13:21 IST|Sakshi

నగరంలో పెరిగిన మట్టి కుండల వాడకం 

ఆకర్షణీయంగా కుండల తయారీ 

ఫ్రిజ్‌లు ఉన్న కుండలు కొనుగోలు  

ఎండాకాలంలో కూల్‌ కూల్‌గా ...

మియాపూర్‌: రోజు రోజుకూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉపశమనం కోసం ఎక్కువగా జనం దప్పిక తీర్చుకునేందుకు  మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక సంఖ్యలో జనం ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతూ సంప్రదాయ పద్ధతులను పాటిస్తున్నారు. ఇందులో భాగంగా మట్టి పాత్రలు, మట్టి కుండలలో వంటకాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మట్టి కుండలు, మట్టి పాత్రలకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. రకరకాల డిజైన్‌న్లతో కుండలు ఆకర్షిస్తున్నాయి. టీ కప్పు నుంచి వాటర్‌ బాటిళ్లు, వంట పాత్రలు అందుబాటులోకి రావడంతో ఆరోగ్యానికి మేలు చేస్తోందని జనం వాటిని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. 

  • మట్టి కుండలలో సహజంగా చల్ల బరిచే ప్రత్యేకత ఉంది.   
  • హిందూ సాంప్రదాయం ప్రకారం అధికంగా ఉగాది పండుగకు పచ్చడి చేసేందుకు కొత్త కుండలు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు గత పదిహేను రోజుల నుండి ఎండలు మండిపోతుండటంతో చల్లటి నీరు తాగేందుకు ముందుగానే మట్టి కుండలను విక్రయాలు చేస్తున్నారు.  
  • చందానగర్‌లోని గంగారం గ్రామంలో  మట్టి కుండలు తయారు చేసి విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. 
  • మట్టి కుండలలో నీరు తాగడం వలన శరీరానికి చల్లదనం కలగడంతోపాటు ఆరోగ్య పరంగా ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పడమే కాకుండా డాకర్లు సైతం సూచిస్తున్నారు.  
  • టీ కప్పులు, వాటర్‌ జగ్‌లు, వంట పాత్రలు, రంజన్లు, కూజాలు, వాటర్‌ బాటిళ్లు వాటిలో మట్టితో చేసిన వస్తువులు వివిధ రకాల సైజులతో అందుబాటులోకి వచ్చాయి. 
  • అదే విధంగా మట్టి వస్తువుల పై రంగు రంగుల చిత్రాలు చిత్రీకరించి పలు రకాల డిజైన్‌లలో  ఆకర్షణీయంగా తయారు చేస్తూవిక్రయిస్తున్నారు. 
  • ఎక్కువగా మట్టి పాత్రలను రాజస్థాన్, గుజరాత్, కోల్‌కత్తా నుండి పలు రకాల డిజైన్ల పాత్రలను తీసుకొచ్చి విక్రయాలు చేస్తున్నారు.  
  • వేసవిలో ప్రత్యేకంగా ఉపయోగించే కుండలకు ట్యాప్‌ ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. వాటికి  గిరాకి ఉంది. 
మరిన్ని వార్తలు