ఖమ్మంలో టైపింగ్‌ ప్రశ్నాపత్రం తారుమారు

23 Aug, 2021 09:13 IST|Sakshi
పరీక్ష కేంద్రం ఎదుట ఆందోళన చేస్తున్న అభ్యర్థులు

సాక్షి, ఖమ్మం: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న టైపింగ్‌ పరీక్షల్లో టైపింగ్‌ లోయర్‌ ఎగ్జామ్‌లో హయ్యర్‌ ఖమ్మంలో టైపింగ్‌ ప్రశ్నాపత్రం తారుమారు దర్శనమిచ్చింది. దీంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో శని, ఆదివారాల్లో రెండు రోజులుగా టైపింగ్‌ లోయర్, హయ్యర్, హైస్పీడ్‌ పరీక్షలు జరుగుతుండగా ఆదివారం 52మంది అభ్యర్థులు లోయర్‌ 4వ బ్యాచ్‌ పరీక్షకు హాజరయ్యారు. వీరికి హయ్యర్‌ ఖమ్మంలో టైపింగ్‌ ప్రశ్నాపత్రం తారుమారు రావడంతో అభ్యర్థులు లబోదిబోమన్నారు.

లోయర్‌ గ్రేడ్‌కు సంబంధించిన 45నిమిషాల మనుస్క్రిప్ట్‌ పేపర్‌–2  100మార్కులకు ఉండగా.. 45మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే..పూర్తిగా ప్రశ్నపత్రమే మారడంతో అభ్యర్థులు పరీక్ష పూర్తయిన అనంతరం తమకు జరిగిన నష్టానికి సాంకేతిక విద్యాశాఖ లోపమే కారణమని ఆరోపించారు. విద్యార్థులకు మారిన ప్రశ్నలకు గాను పూర్తిస్థాయిలో మార్కులు వేయాలని ఖమ్మం జిల్లా టైపు రైటింగ్‌ అసోసియేషన్‌ సభ్యులు బాబా తదితరులు కోరారు.  

చదవండి: ఐటీ పోర్టల్‌ లోపాలు.. ఇన్ఫోసిస్‌పై కేంద్రం గరం

మరిన్ని వార్తలు