KCR Tamil Nadu Tour: స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీకి ప్రాధాన్యత

14 Dec, 2021 02:29 IST|Sakshi
శ్రీరంగం రంగనాథస్వామి దర్శనానంతరం ఆలయం వద్ద కేసీఆర్, కుటుంబ సభ్యులు

 కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కేసీఆర్‌ విమర్శలు 

 రైతుల విషయంగా పోరాటం చేస్తామని ప్రకటనలు 

 బీజేపీని గద్దెదింపాలనుకునే శక్తులను కేసీఆర్‌ కలుస్తారంటూ ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలు 

 ఈ క్రమంలో దేశ రాజకీయాలపై సీఎంలు చర్చిస్తారనే అంచనాలు 

 సోమవారం తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌

  కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు.. రాత్రి చెన్నైలో బస 

సాక్షి, చెన్నై/ హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో చెన్నైలో భేటీకానున్నారు. కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుపై సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తుండటం.. రైతులు, వ్యవసాయ అంశాలపై దేశవ్యాప్త పోరాటం చేస్తామని ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో బీజేపీని వ్యతిరేకించే ఇతర బలమైన రాజకీయ పార్టీలను కూడగట్టేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారా? అందులో భాగంగానే స్టాలిన్‌తో భేటీ అవుతున్నారా? అన్న చర్చ మొదలైంది. 

ఇటు సీఎం పర్యటన.. అటు పల్లా వ్యాఖ్యలు   
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్‌ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్‌ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని కేసీఆర్‌ ప్రకటించారు. బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్‌.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 
 
రంగనాథ స్వామిని దర్శించుకుని.. 
సీఎం కేసీఆర్‌ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్‌ నెహ్రూ, అధికారులు కేసీఆర్‌ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాంశు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్‌ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. 

యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం 
యాదాద్రి ఆలయ పునః ప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజుల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. గత నెల 18న సీఎం కేసీఆర్‌ స్వయంగా ధర్నా కూర్చున్నారు. తర్వాత వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీపై, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. అవసరమైతే ఢిల్లీలో కూడా నిరసనకు దిగుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలతో జట్టుకట్టాలనే యోచనలో ఉన్నారని, అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ తమిళనాడు పర్యటనకు వెళ్లడం.. ఇదే సమయంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేంత వరకు టీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని, బీజేపీని గద్దె దించాలని కోరుకుంటున్న శక్తులను కేసీఆర్‌ కలుస్తారని ప్రకటించడం.. చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యా మ్నాయ రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని కేసీఆర్‌ ప్రకటించారు. బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిలతో వరుస భేటీలు జరిపారు. అప్పట్లో పలు కారణాలతో వెనక్కితగ్గిన కేసీఆర్‌.. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 

రంగనాథ స్వామిని దర్శించుకుని.. 
సీఎం కేసీఆర్‌ సోమవారం కుటుంబసమేతంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు ఉదయమే హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. తమిళనాడులోని తిరుచ్చికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ఆలయ పండితులు వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర మంత్రి అరుణ్‌ నెహ్రూ, అధికారులు కేసీఆర్‌ వెంట ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేసీఆర్, ఆయన భార్య శోభతోపాటు మంత్రి కేటీఆర్, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, ఎంపీ సంతోష్‌కుమార్‌ తదితరులు రంగనాథస్వామిని దర్శించుకున్నారు. తర్వాత సీఎం కేసీఆర్‌ ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయ నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో భేటీ కానున్నట్టు ప్రకటించారు. అనంతరం చెన్నైకి చేరుకుని రాత్రికి అక్కడే ఓ హోటల్‌లో బస చేశారు. 

యాదాద్రి పునః ప్రారంభానికి ఆహ్వానం 
యాదాద్రి ఆలయ పునఃప్రారంభవేడుకలకు రావాల్సిందిగా స్టాలిన్‌ను సీఎం కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. మార్చి 22న సుదర్శన యాగంతో ప్రారంభమయ్యే వేడుకలు 28న అర్ధరాత్రి ముగియనున్నాయి. ఆ వారం రోజు ల్లో ఏదో ఒకరోజు వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోవాలని స్టాలిన్‌ను కేసీఆర్‌ కోరనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. చెన్నైలో జరిగే భేటీలో దేశ రాజకీయాలతోపాటు, రాష్ట్రాల పట్ల కేంద్ర వైఖరి, సమాఖ్య స్ఫూర్తికి గండి కొడుతున్న తీరుపై ఇద్దరు సీఎంలు చర్చించే అవకాశముంది.  

మరిన్ని వార్తలు