24 గంట‌ల్లో తెలంగాణ‌లో కొత్తగా 4,826 కేసులు

10 May, 2021 19:19 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 4,826  కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 32 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో  7,754 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 4,36,619 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 62,797 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 2,771 మంది మృతి చెందారు. కొత్త కేసులు అత్యధికంగా..జీహెచ్‌ఎంసీలో 723, రంగారెడ్డి జిల్లాలో 302 ,మేడ్చల్‌ జిల్లాలో 324, సిద్దిపేట జిల్లాలో 161 కేసులు నమోదయ్యాయి.

( చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..! )

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు