ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం

20 Jun, 2022 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో పరస్పర బదిలీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. పరస్పర బదిలీలకు సంబంధించి ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 2,558 మంది ఉద్యోగుల, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు