16 ‘ఎత్తిపోతల’కు కార్యాచరణ!

31 Jul, 2021 08:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రూ.3,600 కోట్ల విలువైన పనుల టెండర్లకు ఆదేశాలిచ్చే అవకాశం

1.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ప్రణాళిక

ఎస్సారెస్పీ స్టేజ్‌–2 ఆధునీకరణ పనులకు దక్కనున్న మోక్షం

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందించేవిధంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా 16 ఎత్తిపోతల పథకాల పనులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. వీటి తుది అంచనాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ ఇంజనీర్లకు మార్గదర్శనం చేయనున్నారు. ఆగస్టు 2న నాగార్జునసాగర్‌ నియోజకవర్గం లోని హాలి యాలో పర్యటించనున్న సీఎం టెండర్లు, నిధుల సమీకరణ, కార్యాచరణ ప్రణాళికపై ఇంజనీర్లకు కీలక ఆదేశాలివ్వనున్నారు.

సీఎం పర్యటన తర్వాత టెండర్లు
మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, హజూర్‌నగర్, సూర్యా పేట, కోదాడ నియోజకవర్గాల్లో 1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్‌ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్‌ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. 
  
1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్‌ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్‌ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. 

ఎస్సారెస్పీ స్టేజ్‌–2 పనులకు..
సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గంలోని చివరి ఆయకట్టు వరకు గోదావరి నీటిని పారించేలా శ్రీరాంసాగర్‌ రెండోదశ (స్టేజ్‌–2) కాల్వలను పూర్తిస్థాయిలో లైనింగ్‌ చేసి ఆధునీకరించే పనులకు సీఎం పర్యటనలో మోక్షం లభించే అవకాశముంది. రూ.400 కోట్లతో స్టేజ్‌–2 పరిధిలోని ప్రధాన డిస్ట్రిబ్యూటరీలన్నింటినీ ఆధునికీకరించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డీబీఎం–69 కాల్వల లైనింగ్‌ను రూ.54 కోట్లు, డీబీఎం–70 కాల్వల లైనింగ్‌ను రూ.12 కోట్లు, డీబీఎం–71 లైనింగ్‌కు రూ.159 కోట్లతో ప్రతిపాదించగా, వీటితోపాటే ఈ డిస్ట్రిబ్యూటరీల కింది పిల్ల కాల్వలు, ఇతర చిన్న కాల్వల లైనింగ్‌ పనులను మరో రూ.175 కోట్లతో ప్రతిపాదించారు. వీటిపై సీఎం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసే అవకాశముంది.  

మరిన్ని వార్తలు