గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై స్పందించిన తెలంగాణ అడ్వకేట్‌ అరుణ్‌

19 Aug, 2022 18:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు అడ్వకేట్‌ అరుణ్‌ స్పందించారు. ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా ఎంపీ మాధవ్‌ను టార్గెట్‌ చేయడం బాధాకమరని అన్నారు. ఈ విషయంలో వారు హద్దులు దాటి ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు మాధవ్‌ ఫేక్‌ వీడియోని అమెరికాకు పంపడమే కాకుండా తప్పుడు రిపోర్ట్‌ని సర్క్యులేట్‌ చేశారని తెలిపారు. విదేశాలకు ఒక ఎంపీ వీడియోను పంపడమంటే దీనిని భారత పార్లమెంట్‌పై దాడిగా పరిగణించాలని అడ్వకేట్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. 

చదవండి: (Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్)

మరిన్ని వార్తలు