హైదరాబాద్‌: భారీ స్థాయిలో ఐటీ రైడ్స్‌ కలకలం.. ఆ లెక్కపై ఆరా?

4 Jan, 2023 11:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి ఐటీ దాడుల పర్వం మొదలైంది. ఇందులో భాగంగా రాజధాని నగరంలో భారీ స్థాయిలో సోదాలకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బుధవారం వేకువ జామునే ఐటీ రైడ్స్‌తో ఉత్కంఠకు తెర తీసింది ఆర్థిక విభాగం.

హైదరాబాద్‌లోని ఐటీ ఆఫీస్ నుంచి బయల్దేరారు ఐటీ అధికారులు. సుమారు 40 కార్లు, మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్ లో ఐటీ బృందాలు రైడ్స్‌కు బయలుదేరాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎక్సెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ లక్ష్యంగా దాడులకు దిగినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఐకియా షోరూం పక్కన ఉన్న ఎక్సెల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. 

10:25AM
ఎక్సెల్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఐటీ దాడులు సాగుతున్నాయి. బాచుపల్లిలోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. 

10:36AM
► 20 చోట్ల కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లతోపాటు చైర్మన్ సీఈఓ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎక్సెల్ గ్రూప్ కి అనుబంధంగా ఉన్న మరొక 10 కంపెనీలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలితో పాటు మాదాపూర్ బాచుపల్లిలోని కార్యాలయాల్లో సోదాలు సాగుతున్నాయి. మరోవైపు రబ్బర్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్‌లో భారీగా తేడాలతో పాటు ట్యాక్స్ చెల్లింపు లో  అవకతవకలు జరిగినట్లు సమాచారం అందుతోంది. 

10:45AM
► సంగారెడ్డి లోని నాలుగు కంపెనీలో సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగ్ లోని  ఆరు చోట్ల,  బాచుపల్లి దుండిగల్  లోని 4 కంపెనీలలో సోదాలు నడుస్తున్నాయి.

11:31AM
► లండన్ నుంచి 500 కోట్ల ఫండ్ exel కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ క్రమంలో.. ఆ లెక్కపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు. 

మరిన్ని వార్తలు