తెలంగాణలో సామూహిక జాతీయ గీతాలాపన గ్రాండ్‌ సక్సెస్‌.. పాల్గొన్న సీఎం కేసీఆర్‌

16 Aug, 2022 11:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ప్రశాంతంగానే కాదు.. గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. 

అబిడ్స్‌ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన లభించింది. ఒక్క నిమిషం మెట్రోసర్వీసులు ఆగిపోగా..  ఎక్కడికక్కడే ప్రయాణికులు జాతీయ గీతం ఆలపించారు.


సికింద్రాబాద్ ప్యాట్నీ కూడలి వద్ద జనగణమన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న నగర పౌరులు

సిగ్నల్స్‌ వద్ద నిమిషం పాటు రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చి అంతా కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు మిగతా జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే చాలాచోట్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు వాహనదారులు.

ఇదీ చదవండి:  హైదరాబాద్‌లో మూడు నాలుగు గంటలపాటు ఈ రూట్‌లలో భారీగా ట్రాఫిక్‌ ఆంక్షలు

మరిన్ని వార్తలు