‘జీఎస్టీ నుంచి శాశ్వతంగా న్యూట్రల్ ఆల్కహాల్‌ను మినహాయించాలి’

28 May, 2021 22:29 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం జీఎస్టీ వర్చువల్ భేటీలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బడ్జెట్లో 18శాతం సెస్‌, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. 22.17లక్షల కోట్ల బడ్జెట్‌లో సెస్, సర్‌ఛార్జీల రూపంలో కేంద్రానికి రూ.3.99 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని అన్నారు. జీఎస్టీ పరిధిలోకి న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవడం సమంజసం కాదని అసహనం వ్యక్తం చేస్తూ శాశ్వతంగా మినహాయించేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం వసూలు చేస్తోన్న సెస్‌, సర్‌ఛార్జీల వల్లే రాష్ట్రాలు 41 శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాయని, అందులో  తెలంగాణ ప్రతీ ఏటా 2.102 శాతం ఆదాయం కోల్పోతుందని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి రాకుండా రాష్ట్రాలకు వదిలినవి ఎక్సైజ్, పెట్రోల్ అండ్‌ డీజిల్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువగా ఆదాయం వస్తోంది సెస్, సర్ ఛార్జీల రూపంలోనేనని గుర్తుచేశారు. 

చదవండి: విరించి ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్సకు అనుమతులు రద్దు

 

మరిన్ని వార్తలు