మీడియా స్వేచ్ఛ హరించుకుపోతోంది

11 Jan, 2023 02:09 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వినోద్‌ కోహ్లీ, అల్లం నారాయణ 

తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ

పటాన్‌చెరు టౌన్‌: దేశంలో మీడియా స్వేచ్ఛ రోజురోజుకూ హరించుకుపోతోందని.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షా గొంతులు తప్ప మిగిలిన గొంతులు మూగబోయిన పరిస్థితి ఉందని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో మంగళవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ మహాసభల ముగింపు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ఏది మాట్లాడినా అణచివేసే ధోరణి వచ్చిందని.. వర్గ శత్రువులతో ఉంటే జర్నలిస్టులను కూడా విధ్వంసకారులుగా పరిగణించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహాసభల ముగింపు సందర్భంగా ఐజేయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్‌ జాతీయ అధ్యక్షుడిగా వినోద్‌ కోహ్లీ,  ప్రధాన కార్యదర్శిగా సభా నాయక్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైస్‌ ప్రెసిడెంట్‌గా సయ్యద్‌ ఇస్మాయిల్‌(తెలంగాణ), కార్యదర్శులుగా నారాయణ పంచల్‌( మహారాష్ట్ర), రతుల్బోరా(అసోం), రాజమౌళిచారి(తెలంగాణ), ట్రెజరర్‌గా నతుముల్‌ శర్మ (ఛత్తీస్‌గఢ్‌), ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా నవీన్‌ శర్మ(చండీగఢ్‌), భాస్కర్‌(తెలంగాణ) సిమిజాన్‌ (కేరళ), బాబు థోమస్, అనిల్‌ బిశ్వాస్, తారక్‌ నాథ్‌రాయ్‌(వెస్ట్‌బెంగాల్‌), రవి (మహారాష్ట్ర), జుట్టు కలిత (అసోం)ను ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు