రాత్రయితే పులుల గాండ్రింపు

29 Nov, 2021 04:12 IST|Sakshi
నేలవంచ ప్రాంతంలో కాపలా కాస్తున్న అటవీ శాఖ సిబ్బంది  

మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో ఆందోళన  

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు సమీపంలోంచే వస్తున్న పులి గాండ్రింపులు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రెండు రోజులుగా గూడూరు మండలం మట్టెవాడ శివారు దొరవారి తిమ్మాపురం, నేలవంచ, సరస్వతీనగర్‌ ప్రాంతాల్లో పులి సంచరిస్తూ రెండు ఆవులపై దాడి చేసి చంపిన విషయం విదితమే. దీంతో అటవీ శాఖ జిల్లా ఉన్నతాధికారులు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. గ్రామాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.

దొరవారి తిమ్మాపురం వాసులకు శనివారం రాత్రి చాలా దగ్గర నుంచి పులి గాండ్రింపులు వినిపించడంతో భయంతో కాలం గడిపినట్లు తెలిపారు. పక్క గ్రామాల వారు కూడా గాండ్రింపులు విన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. రెండు రోజులుగా మండల అటవీ శాఖ అధికారులు నేలవంచ, దొరవారి తిమ్మాపురం గ్రామాల ప్రాంతంలో పొద్దంతా కాపలా కాస్తూ.. పశువులు, గ్రామస్తులు అడవిలోకి వెళ్లకుండా పహారా కాస్తున్నారు. ప్రస్తుతం పులి ఏ వైపు నుంచి వస్తుందోనని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. 

మరిన్ని వార్తలు