ఆపన్నులకు అండ.. పేదలకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ భరోసా

8 Nov, 2023 01:50 IST|Sakshi

ఉచిత న్యాయ సేవలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు

రైతుల కోసం అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ల ఏర్పాటు 

లోక్‌ అదాలత్‌ల నిర్వహణతో కోర్టుల భారం తగ్గింపు 

రేపు జాతీయ న్యాయసేవల ప్రాధికారిక దినం

హక్కులకు భంగం కలిగితే కోర్టును ఎలా ఆశ్రయించాలో తెలియదు.. పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదైతే ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు..న్యాయవాదిని పెట్టుకొనేంత ఆర్థిక స్తోమత లేదు.. ఇదీ సగటు పేదవాడి దుస్థితి. ఈ పరిస్థితుల్లో పేద ప్రజలు న్యాయం కోసం ఏం చేయాలి.. ఎవరిని ఆశ్రయించాలి? ఈ ప్రశ్నలకు సమాధానంగా దాదాపు 25 ఏళ్ల క్రితం ఏర్పాటైందే ‘లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ (ఎల్‌ఎస్‌ఏ)’. ఈ నెల 9న జాతీయ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ డే, తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రత్యేక కథనం.

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు న్యాయ సా యం అందించడం, కోర్టు కేసులను మ ధ్య వర్తిత్వంతో పరిష్కరించడం, లోక్‌ అదాలత్‌లు నిర్వహించడమే కాదు.. వృద్ధులకు ఆసరాగా నిలవడం, పేద విద్యార్థులకు సాయం చేయడం సహా అనేక సామాజిక కార్యక్రమాలను లీగల్‌ సర్విసె స్‌ అథారిటీ నిర్వహిస్తోంది.

పత్రికల్లో వచ్చిన కథనా ల ఆధారంగా లేదా సుమోటోగా పలువురి బాధల ను తీరుస్తోంది. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో పడకలు అందేలా చర్యలు తీసుకోవడం, విడిపోయి న భార్యాభర్తలను కలపడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం వసతు లు, వేతనం అందేలా చేయడం, మతిస్థిమితం కో ల్పోయిన వారికి ఆశ్రయం కల్పించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. 

1995లో ఏర్పాటు
లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ చట్టం–1987 ప్రకారం 1995 నవంబర్‌ 9న జాతీయ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఏర్పాటైంది. దీనికి జాతీయ స్థాయిలో ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీలు పని చేస్తాయి.  

వృద్ధ దంపతులకు ఆసరా.. 
ఖమ్మం జిల్లాకు చెందిన రామన్న, కృష్టమ్మ దంపతులు. ఉన్న ఆస్తినంతా పిల్లలకు పంచిపెట్టారు. మలి వయసులో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పిల్లలు వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా లీగల్‌ సెల్‌ అథారిటీ వారిని సంప్రదించింది. చట్టప్రకారం 3 ఎకరాల 20 గుంటల భూమిని తిరిగి వృద్ధ దంపతుల పేర రిజిస్ట్రేషన్  చేయించి ఆసరా కల్పించింది. అమరచింతలోని కియోస్‌్కలో వారికి ఆశ్రయం అందించింది. 

నిరుద్యోగులకు చేయూత.. 
మహబూబ్‌నగర్‌ జిల్లా సెంట్రల్‌ లైబ్రరీకి రోజూ సుమారు 200 మంది విద్యార్థులు, నిరుద్యోగులు వస్తుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చిన కొందరు సాయంత్రం 6 గంటల వరకు అక్కడే చదువుకుంటా రు. వారిలో ఎక్కువ మంది పేదలే కావడం, మధ్యాహా్నలు భోజనం కూడా చేయడం లేదని గుర్తించిన జిల్లా లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ.. మున్సిపల్‌ చైర్మన్‌తో సంప్రదింపులు జరిపింది. రూ. 5కే మంచి భోజనం అందేలా చర్యలు తీసుకొని చేయూతనిచ్చింది.

33 జిల్లాల్లో ప్రత్యేక న్యాయవాదులు
పేదల కేసులను వాదించేందుకు, న్యాయ సలహా అందించేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించాలన్న జాతీయ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెల్‌ (జిల్లా స్థాయి), డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెల్‌ (సబ్‌–కోర్టు), అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సెల్‌ (మేజిస్ట్రేట్  కోర్టు)ను పూర్తిస్థాయిలో నియమించారు. రాష్ట్రంలో ప్రభుత్వ సహకారంతో 33 జిల్లాల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. 

ఏం న్యాయ సేవలు అందిస్తారు? 
1). ఉచితంగా న్యాయ సలహాలు అందించడం 
2). కేసులు పరిశీలించి బాధితుని తరఫున న్యాయవాదిని నియమించడం 
3). కోర్టు ఫీజులను భరించడం 
4). తీర్పు వచ్చిన తర్వాత కాపీలను ఉచితంగా అందజేయడం 

ఆశ్రయించడం ఎలా? 
ఉచిత న్యాయ సాయం కోసం మండల న్యాయసేవాధికార సంఘం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040–23446723 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌ 15100ను సంప్రదించవచ్చు. 

న్యాయ సాయం ఎవరికి.. 
1).    షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు 
2).    మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు 
3).    మహిళలు, బాలబాలికలు 
4).    అంగవైకల్యం కలిగిన వ్యక్తులు 
5).    ప్రకృతి విపత్తులు, కుల, మత కల్లోలాల బాధితులు 
6).    పారిశ్రామిక కార్మికులు 
7).    రక్షణ గృహం, అనాథ గృహం, బాలల గృహం, మానసిక చికిత్సాలయంలో ఆశ్రయం పొందుతున్న వారికి.. 
8). సంవత్సర ఆదాయం రూ.3 లక్షలు మించని వారికి... 

అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.. 
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు సాయం చేయడం కోసం అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను రాష్ట్రంలో ప్రారంభించాం. దుక్కి దున్నే నాటి నుంచి పంటను మార్కెట్లో అమ్మేదాకా సాగు చట్టాలు, నియమాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తాం. కోర్టులపై భారం తగ్గించేందుకు లోక్‌ అదాలత్‌లను నిర్వహిస్తున్నాం. 
– గోవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ సభ్య కార్యదర్శి  

మరిన్ని వార్తలు