Minister KTR: కోహ్లి సెంచరీ కొట్టిండు.. నేను కూడా కొట్టాలె

15 Nov, 2023 21:30 IST|Sakshi

సిరిసిల్ల: కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చినందుకు.. దేశంలో వడ్లు పండించడంలో తెలంగాణ నంబర్ వన్‌గా తయారైందని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్ళీ కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే బస్మాసుర హస్తమేనని విమర్శించారు. 55 ఎండ్లు పరిపాలించిన కాంగ్రెస్‌కు మళ్ళీ అవకాశం ఇద్దమా..? అని ప్రజలనుద్దేశించి ప్రశ్నించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ రోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.. నేను కూడా సెంచరీ కొట్టడానికి తిరగాలని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

మళ్ళీ అవకాశం ఇస్తే భారత దేశంలోనే సిరిసిల్లను నంబర్ వన్ గా చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తర్వాత అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని ప్రకటించారు. సిరిసిల్లలో ఏం మార్పు వచ్చిందో చూడాలని ప్రజలను కోరారు. బ్రిడ్జి కింద 24 గంటల నీళ్లు సముద్రంలాగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇవ్వాళ మనకు పోటీగా ఒక దిక్కు కాంగ్రెస్ మరో దిక్కు బీజేపీ ఉన్నాయని పేర్కొన్న కేసీఆర్.. సిద్దిపేటకు రైల్ వచ్చింది.. త్వరలో సిరిసిల్లకు రైలు కుతా వినిపిస్తదని చెప్పారు.

ఇదీ చదవండి: కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం: రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు