బీజేపీకి విజయశాంతి రాజీనామా

15 Nov, 2023 21:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. తాజాగా విజయశాంతి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం వినిపిస్తుండగా.. ఇప్పుడు రాజీనామా పరిణామంతో అది ఖాయంగానే కనిపిస్తోంది.

ఇదీ చదవండి: నైంటీస్‌లోనే బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా రాములమ్మ

మరిన్ని వార్తలు