Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

21 Apr, 2022 17:07 IST|Sakshi

కంట్రోల్‌లోనే కరోనా.. మాస్క్‌లు ధరించాల్సిందే!: తెలంగాణ డీహెచ్‌
 తెలంగాణలో కరోనా అదుపులోనే ఉన్నా..  జాగ్రత్తలు పాటించాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.

ఆప్ఘనిస్తాన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. పదుల సంఖ‍్యలో మరణాలు
వరుస బాంబు పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్‌ అతలాకుతలం అవుతోంది. దేశ రాజధాని కాబూల్ సహా మరో ఐదు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

సెన్సేషన్‌ మిస్టరీ కేసు.. శశికళను ప్రశ్నించిన పోలీసులు
చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళను తమిళనాట సంచలనం సృష్టించిన కొడనాడు కేసులో పోలీసులు ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక బృందం గురువారం టీ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్లింది. సుమారు గంటకు పైగా ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం.

రష్యా దాడులు సక్సెస్‌.. ‘విముక్తి’ అంటూ పుతిన్‌ సంచలన ప్రకటన
దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు  కొనసాగిస్తున్నాయి. ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా పుతిన్‌ సేనలు ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

ఆ కేసులను ఎత్తివేస్తున్నాం: సీఎం జగన్‌
 గతంలో గ్రాసిమ్‌ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని.. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

ఆ హీరోయిన్‌ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్‌
కేజీయఫ్ 2తో రాకీ భాయ్ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్‌ ఎక్కడ..
ఢిల్లీలోని జహంగీర్‌పూరిలో బుధవారం అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. 

మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం
ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వెల్లడించారు. 

యువ స్విమ్మర్‌ మృతి.. భౌతిక కాయం తరలించేందుకు డబ్బుల్లేని దుస్థితి
మూడు జాతీయ అవార్డుల గ్రహీత, కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత స్విమ్మర్‌ అమర్త్య చక్రవర్తి (19) అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో మృతి చెందాడు

కరోనాలోనూ సీఈఓలకు వందల కోట్ల  బోనస్‌లు,సుందర్‌ పిచాయ్‌కు షాక్‌!
కరోనా మహమ్మారి  కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి.దిగ్గజ టెక్‌ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి.  

మరిన్ని వార్తలు