కొనలేం.. తినలేం! 

25 Aug, 2020 09:07 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు వంటింటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారం రోజుల్లో నే కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. హోల్‌సేల్‌/ రైతు బజార్‌లలోనే పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్‌లో ధరలు దాదాపు మూడు రెట్లు కావడం గమనార్హం. నగరంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌ బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ యార్డులో ఈ నెల 17, 24వ తేదీల్లో హోల్‌సేల్‌ / రైతు బజార్‌లలో కూరగాయల ధరలు పరిశీలిస్తే దాదాపు రెట్టింపుగా ఉన్నాయి.

విరివిగా ఉపయోగించే టమాట, వంకాయ, దొండకాయ, బెండ, బీరకాయ వంటి కూరగాయల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. తాజాగా వర్షాలతో పెద్ద మొత్తంలో పంటలు నీట మునగడంతో దిగుబడి తగ్గిన కారణంగా కూరగాయల ధరలు పెరుగుతున్నట్లు హోల్‌సేల్‌ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా వినాయక చవితికి ఎక్కువగా వినియోగించే పచ్చి చింతకాయ ధర మాత్రం హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే కిలో రూ. 250 పలకడం గమనార్హం. 

మరిన్ని వార్తలు