తారకరత్న మృతితో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడిలో ఉంది: విజయసాయిరెడ్డి

19 Feb, 2023 18:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, తారకరత్న మరణంపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తారకరత్న మరణం ఎంతో బాధించిందన్నారు. 

ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి తారకరత్న. 39 ఏళ్ల వయస్సులోనే తారకరత్న అకాల మరణం చెందడం చాలా బాధకరం. ఆయన మరణం ఎంతో బాధించింది. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డి మానసిక ఒత్తిడికి లోనవుతోంది. రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు ఫిల్మ్‌ చాంబర్‌కు తారకరత్న భౌతికకాయం తరలిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగుతాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు