రోజుకు పది గంటలు చదివితే ఉద్యోగం ఖాయం 

10 Apr, 2022 03:27 IST|Sakshi
స్టడీ మెటీరియల్‌ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న వరంగల్‌ సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి  

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌జోషి 

వరంగల్‌: యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే రోజుకు పది నుంచి పన్నెండు గంటలు కష్టపడి చదవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి సూచించారు. వరంగల్‌ కమిషనరేట్‌ శిక్షణ కేంద్రంలో పోలీస్‌ ఉద్యోగాల కోసం కోచింగ్‌ శిక్షణ పూర్తిచేసుకున్న యువతకు శనివారం హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తరుణ్‌ జోషి మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది సెంటర్లలో శిక్షణ తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. పీజేఆర్‌ కోచింగ్‌ సెంటర్‌కు చెందిన నిపుణులైన అధ్యాపకులతో కోచింగ్‌ ఇచ్చా మని, ప్రతి విద్యార్థికి రూ.2 వేల విలువైన స్టడీ మెటీరియల్‌ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యువత శిక్షణ కాలం అనుభవాలను అధికారులతో పంచుకున్నారు. కార్యక్రమంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఇన్‌స్పెక్టర్లు రాఘవేం దర్, శ్రీనివాస్, రవికుమార్, రమేశ్, పీజేఆర్‌ కో చింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు