బ్రహ్మోత్సవం..ఆరంభం

11 Nov, 2023 00:46 IST|Sakshi
వైభవంగా పవిత్రాల సమర్పణ
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

IIలో

తిరుచానూరు (చంద్రగిరి): శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు ధ్వజారోహణం నిర్వమించారు. ధనుర్లగ్నంలో గజ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి చిన్నశేష వాహనంపై వెన్నముద్ద కృష్ణుడిగా అమ్మవారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

సాంస్కృతిక వైభవం

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతికకార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నశేష వాహన సేవలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వేషధారణలతో ఉండగా, ఇతర విద్యార్థులు అన్నమయ్య సంకీర్తనలకు లయబద్ధంగా సంప్రదాయ నృత్యం చేశారు. లంబాడి నృత్యం, దింసా నృత్యం, కరగం, వీరనాట్యం, భరతనాట్యం ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు