ప్రపంచానికి బ్రిటన్‌ యువరాజు హెచ్చరిక..?

3 Dec, 2020 19:42 IST|Sakshi

లండన్‌: ప్రకృతిలో వస్తున్న మార్పులను నియంత్రించడానికి  తదుపరి చర్యలపై దృష్టి పెట్టాలని ప్రిన్స్‌ హ్యారీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ ప్రకృతి నుంచి వచ్చిన ఒక హెచ్చరిక లాంటిదని వ్యాఖ్యానించారు. వాతావరణంలో మార్పులుపై‌ డాక్యుమెంటరీల కోసం స్టీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌తో ఆయన సంభాషించారు. మనుషుల చెడు ప్రవర్తన వల్లే ప్రకృతి తల్లి కరోనాను పంపినట్లుగా ఉందని, నిజంగా మనం దాని గురించి ఒక్కసారి ఆలోచించాలని హ్యారీ అన్నారు. మనం కేవలం మనుషులం మాత్రమే కాదని, ప్రకృతితో ఎంతలా మమేకం అయ్యామో ఇప్పుడు అర్థమవుతోందన‍్నారు. ప్రకృతి నుంచి చాలా తీసు‍కుంటామని, అయితే మనం ప్రకృతికి చాలా తక్కువ ఇస్తున్నామన్నారు. హ్యారీ అండ్‌ మేఘన్‌, డ్యూక్‌ అండ్‌ డచెస్‌ ఆఫ్‌ సస్సెక్స్‌‌, జాతి, పర్యావరణం వంటి అంశాలపై హ్యారీ మాట్లాడారు.

ఆకాశం నుంచి వచ్చే ప్రతీ నీటి బొట్టు భూమికి ఉపశమనం కలిగిస్తుందని, అలాగే ప్రతీ మనిషి కూడా ఒక నీటి బిందువులా మారి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు., ఎందుకంటే చివరిలో ప్రకృతే మన జీవన వనరు అవుతుందని ప్రిన్స్‌ గుర్తుచేశారు. ‍కరోనా మహమ్మారి ప్రారంభం అయినప్పటినుంచీ శాస్త్రవేత్తలు అటవీ నిర్మూలన, వన్యప్రాణుల అక్రమ రవాణావల్ల జంతువుల నుంచి మనుషులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారన్నారు. ఇంకా దానిపై కఠినమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు