More

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించండి!!

22 May, 2018 03:32 IST

అధికారులకు సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో 10 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు తగ్గించాలన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

వేసవిలో వడగాడ్పులు పెరిగే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కాలువలు, జలాశయాల్లో నీటి నిల్వలు పెంచాలని, పచ్చ దనం, తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతలను కొంత మేరకు తగ్గించగలమని చెప్పారు.   

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత

గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. నమ్ముకుంటే అంతేనా?

‘మా ప్రభుత్వానికి రైతు శ్రేయస్సే ముఖ్యం’

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం

AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా?