More

కొండముచ్చు.. ప్రజెంట్‌ సార్‌

19 Jul, 2019 10:40 IST

సాక్షి, ప్యాపిలి(కర్నూలు) : నేను పాఠాలు వింటా.. అంటూ వెంగళాంపల్లి ప్రాథమిక పాఠశాలకు కొద్ది రోజులుగా ఓ కొండముచ్చు హాజరవుతోంది. సమీప కొండల్లోంచి వచ్చిన ఆ కొండముచ్చు విద్యార్థులతో సరదాగా గడుపుతోంది. కాసేపు తరగతిలో కూర్చుని శ్రద్ధగా పాఠాలను సైతం వింటోంది. విద్యార్థులు ప్రేమతో ఏదైనా ఇస్తే ఆరగిస్తోంది.  ఇంత వరకు విద్యార్థులపై దాడి చేయలేదు. సాధారణంగా చిన్న పిల్లలు టీవీల్లో కార్టూన్స్‌ చూస్తూ ఆనందిస్తుంటారు. అందులో కోతి చేష్టలు చూస్తూ కడుపారా నవ్వుతారు. ఇక్కడ మాత్రం ప్రత్యక్షంగా చూడటమే కాదు.. సరదాగా దానితో ఆడుకుంటూ అనుబంధాన్ని పెంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యం

కార్పొరేట్‌ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు

బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?: వరుదు కళ్యాణి

చంద్రబాబుకి అసలు సర్జరీ ఎలా చేశారు?

నేడు విశాఖ, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సాధికార యాత్ర