More

అవసరమయితే వంద రోజుల సమ్మె: ఏపీఎన్జీవోలు

22 Jul, 2013 16:25 IST

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుల ఇళ్లముందు ఈనెల 29న ధర్నాలు చేయనున్నట్లు ఏపీ ఎన్‌జీవోల సంఘం నాయకులు తెలిపారు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉండాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా చేస్తామన్నారు.

సమైక్యాంధ్ర సాధన కోసం హైదరాబాద్‌లో త్వరలో సన్నాహక సమావేశం జరుగుతుందని, అలాగే విశాఖ, తిరుపతి, విజయవాడ, కడప, అనంతపురాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఏపీ ఎన్‌జీవోలు స్పష్టం చేశారు.

సమైక్యాంధ్ర కోసం అవసరమయితే వంద రోజుల సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. సమైక్యాంధ్ర విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రం ముమ్మాటికీ ఉమ్మడి ఆస్తే, వదులుకునే ప్రసక్తే ఉండదన్నారు. తెలంగాణవాదులు చెబుతున్న వెనుకబాటుతనంలో వాస్తవం లేదన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

టైమ్స్‌నౌ-ఈటీజీ సర్వే.. YSRCP ప్రభంజనం 

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

పవన్‌ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానవాసి: మంత్రి గుడివాడ

శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు సీఎం జగన్‌

వైద్యం, విద్యపై ఏపీ సర్కార్‌ ప్రత్యేక శ్రద్ధ: కొమ్మినేని