More

పసిడికి రెక్కలు

21 Jun, 2019 07:48 IST

ఒకే రోజు రూ.512 పెరుగుదల

సాక్షి, చెన్నై: హఠాత్తుగా బంగారం ధరకు గురువారం రెక్కలు వచ్చాయి. సవరం బంగారానికి ఒక్క రోజు రూ. 512 పెరిగింది. కొన్ని నెలల అనంతరం ప్రస్తుతం సవరం బంగారం రూ. 25 వేలు దాటింది. గత ఏడాది బంగారం ధరం అమాంతంగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. తదుపరి క్రమంగా తగ్గుతూ, అప్పుడప్పుడు  పెరుగుతూ వచ్చింది.  అయితే, ధర పెరుగదల తగ్గుదల వ్యతాసం తక్కువే. దీంతో బంగారం కొనుగోలుపై పెద్ద సంఖ్యలో జనం దృష్టి పెట్టారు.

ఈ పరిస్థితుల్లో గురువారం హఠాత్తుగా ఒక్క రోజులో బంగారం ధర అమాంతంగా పెరి గింది. బుధవారం ఒక గ్రాము రూ.3,147 ఉంది. అలాగే, సవరం ధర రూ. 25 వేల 176కు చేరింది. అయితే, గురువారం ఈ ధర మరింతగా పెరిగింది. ఒక గ్రాము ధర రూ. 3,211గాను, సవరం ధర రూ. 25,688గాను విక్రయించారు. ఇక సాయంత్రానికి ఈ ధరలో మరింత పెరుగుల కనిపించడం గమనార్హం. ఈ ఒక్క రోజు సవరం బంగారానికి రూ. ఐదు వందల నుంచి రూ. ఆరు వందల వరకు పెరగడం కొనుగోలు దారులకు షాక్‌ తగిలినట్టు అయింది. ఈ పెరుగుదల గురిం చి బంగారు వర్తక సంఘం పేర్కొంటూ, మరో రెండు మూడు రోజులు ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు

‘కన్న కూతుర్ని కొట్టడానికి ఆయనకు చేతులెలా వచ్చాయో’, అంబానీలే లేకపోతే

ఊహించని పరిణామం, ఓపెన్‌ఏఐ సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ బాధ్యతలు

భారత్‌కు క్యూ కడుతున్న సంస్థలు.. గ్లోబుల్‌ కేపబులిటి సెంటర్ల జోరు!

ఈ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లే.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న జాబ్స్‌ ఇవే!