More

గర్ల్‌ఫ్రెండ్స్‌ కోసం డ్యాన్సర్‌ చోరి

16 Nov, 2018 08:41 IST
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : ముగ్గురు గర్ల్‌ఫ్రెం‍డ్స్‌ మెయింటెన్‌ చేయడానికి ఓ 21 ఏళ్ల డ్యాన్సర్‌ దొంగగా మారాడు. ఈ ఘటన ఢిల్లీలోని గోవింద్‌పుర్‌లో  చోటుచేసుకుంది. నిందితుడు గోవింద్‌పుర్‌కు చెందిన రోహన్‌ గిల్‌ అని పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున ఓ ఆటోడ్రైవర్‌ తను సంపాదించిన డబ్బులను లెక్కిస్తుండగా నిందితుడు వాటిని ఎత్తుకెళ్లాడు.

దీంతో అప్రమత్తమైన ఆటోడ్రైవర్‌ కేకలు వేస్తూ.. అతని వెనుకాలే పరుగెత్తాడు. అటువైపుగా వస్తున్న పాట్రోలింగ్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.1900, మొబైల్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడికి ముగ్గురు గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని, వారితో జల్సా చేయడానికి సులువుగా డబ్బు సంపాదించడానికి దొంగతనాలు చేయడం మొదలు పెట్టారని పోలీస్‌ అధికారి చిన్మయ్‌ బిస్వాల్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

సహారా కేసులో ఇన్వెస్టర్లకు ఊరట: సెబీ చీఫ్‌ క్లారిటీ

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

మెడికల్‌ రాకెట్‌ సంచలనం: నకిలీ సర్టిఫికెట్లతో సర్జరీలు, ఏడుగురి మృతి

బరితెగించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అనుచరులు.. రైతులపై దాడి

చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి