More

మెట్రో రైలు ముందు దూకిన సివిల్‌ సర్వీసు విద్యార్థి

9 Jul, 2018 17:17 IST

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్‌ సర్వీసు పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ 23 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కరోల్‌ బాగ్‌ మెట్రో స్టేషన్‌లో ఈరోజు ఉదయం ప్లాట్‌ఫామ్‌ మీదకు వస్తున్న మెట్రో రైలు ముందుకు దూకాడు. ఈ ఘటన ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చోటు చేసుకుంది. మెట్రో రైలు ముందుకు దూకడంతో ఆ విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని అధికారులు రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. 

ముంబైకి చెందిన ఈ విద్యార్థి సివిల్‌ సర్వీసు పరీక్షల కోసం సిద్ధమవుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నిర్మాన్‌ విహార్‌లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు. కరోల్‌ బాగ్‌ మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్లాట్‌ఫామ్‌ మీదకు రైలు వస్తున్న క్రమంలో బ్లూలైన్‌ వద్ద రైలు ముందు దూకినట్టు సీనియర్‌ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో మెట్రో అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. మెట్రో సర్వీసులకు కొద్ది సేపు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.   
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఆరు హత్యల కేసులో ఐదుగురు అరెస్టు

కోతిని తప్పించబోయి ఆటో బోల్తా

48.47%  పెరిగిన సైబర్‌ నేరాలు 

అర్ధరాత్రి కారు బీభత్సం

బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్ర‌మాదం!