More

హిందుస్థాన్ జిందాబాద్’

29 Mar, 2016 02:02 IST
హిందుస్థాన్ జిందాబాద్’

సిటీబ్యూరో: మహా నగరంలోని ముఖ్య కూడళ్లలో ‘హిందుస్థాన్ జిందాబాద్’ ‘ఐ లవ్ మై ఇండియా’ అంటూ  మజ్లిస్ పార్టీ పెద్ద ఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లు  ఏర్పాటు చేస్తోంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాను ఎట్టి పరిస్థితుల్లో ‘భారత్ మాతాకీ జై’ అననని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం విదితమే.

అదేవిధంగా ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సైతం అక్కడి అసెంబ్లీలో అదే వ్యాఖ్యలు చేసి సస్పెండైన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ఎంఐఎం పార్టీ ముఖ్యనేత షాబాజ్ ఖాన్ ముఖ్య కూడళ్లలో ‘ హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ పార్టీ అధినేత, అగ్రనేతలతో కూడిన ఫోటోలతో పెద్దఎత్తున ఫ్లెక్సీ, కటౌట్‌లను ఏర్పాటుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కోర్టులో బిగ్‌బాస్‌ విన్నర్‌ రైతుబిడ్డ బెయిల్‌ పిటిషన్‌

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Live: శాసనసభలో ‘పవర్‌’ వార్‌

కొత్వాల్‌ బన్‌గయా మేజిస్ట్రేట్‌!

ఎలక్షన్‌.. కలెక్షన్‌