More

'మేం గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు'

6 Jun, 2016 15:12 IST

హైదరాబాద్: తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే అమరావతికి వెళ్లడానికి తమకు అభ్యంతరం లేదని సచివాలయ ఉద్యోగులు తేల్చిచెప్పారు. అంతేకాక స్థానికత, హెచ్ఆర్, రోడ్ మ్యాప్ పై వెంటనే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్ లో సచివాలయ ఉద్యోగులు కృష్ణయ్య, వెంకట్ రాంరెడ్డి, భావన తదితరులు మీడియాతో మాట్లాడారు. కనీస మౌలిక వసతులు కల్పించకుండా వెళ్లమంటే ఎలా? అని వారు ప్రశ్నించారు. 
 
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అయోమయం సృష్టిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు వాపోయారు. కాగా,  వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సౌకర్యాలు లేవని హైదరాబాద్ లో ఉంటే కుదరదని ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి రావాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

రాబోయే వ్యాధులకు ముందే చెక్‌!

కాంగ్రెస్‌ వస్తే.. ఆరు నెలలకో సీఎం

కాంగ్రెస్‌లో రె‘బెల్స్‌’ 

కరువు, కర్ఫ్యూ  కాంగ్రెస్‌ కవలలు

అమిత్‌ షా పర్యటనలో మార్పు.. 18న రాక