More

ఐఎస్ఐఎస్కు 42 ఉగ్రవాద సంస్థల మద్దతు

10 Dec, 2015 11:45 IST
ఐఎస్ఐఎస్కు 42 ఉగ్రవాద సంస్థల మద్దతు

ఆధునిక యుగంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థగా రూపాంతరం చెందిన ఐఎస్ఐఎస్కు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 42 ఉగ్రవాద సంస్థల సహకారం ఉన్నట్లు గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న, క్రూరమైన ఉగ్రవాద సంస్థగా ఐఎస్ఐఎస్ రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. తన వినూత్న ప్రచార కార్యక్రమాల ద్వారా ఐఎస్ వివిధ దేశాలకు చెందిన యువతను  పెద్ద ఎత్తున ఆకర్షిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో స్థానిక ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్కు అనుబంధంగా కార్యకలాపాలను నిర్వహించడానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. లిబియా, ట్యునీషియా, ఈజిప్ట్, ఉజ్బెకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐఎస్కు అత్యంత అనుకూలంగా పనిచేస్తున్నట్లు తేలింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్లలోని ఉగ్రవాద సంస్థలు యువతను ఐఎస్ఐస్ తరపున పనిచేయడానికి పంపినట్లు నివేదిక వెల్లడించింది.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

పాక్‌నూ కాటేస్తున్న వాయుకాలుష్యం.. లాహోర్‌ ప్రజలు విలవిల!

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిలిపివేయాలని బెదిరింపులు

దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?

అంటార్కిటికాలో దిగిన అతిపెద్ద విమానం

దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు