More

వాట్సప్లో మరో కొత్త ఆప్షన్!

2 Mar, 2016 18:35 IST
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్!

న్యూ ఢిల్లీ: ఇటీవలే ఫేస్బుక్ యాజమాన్యంలోకి మారిన మెసేజింగ్ యాప్ వాట్సప్.. మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారం వ్యవధిలోనే రెండు సరికొత్త అప్డేట్లను వాట్సప్ అందించింది. ఇటీవలే షేర్డ్ లింక్ హిస్టరీ ట్యాబ్ను వాట్సప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పీడీఎఫ్ ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. అంతేకాదు ఇతర ఫార్మాట్ల లోని ఫైళ్లను సైతం షేర్ చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందించడానికి సంస్థ కృషి చేస్తోంది.

పీడీఎఫ్ ఫార్మాట్లోని ఫైళ్లను షేర్ చేసుకునే సదుపాయం పొందడానికి వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ను వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీ చాట్ లాంటి పలు చాట్ యాప్లతో నెలకొన్న పోటీ దృష్ట్యా.. పలు కొత్త ఫీచర్లను వాట్సప్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఎమోజీలలో వివాదాస్పదమైన మిడిల్ ఫింగర్ ఎమోజీని కూడా ప్రవేశపెట్టి వాట్సప్ దూకుడును ప్రదర్శించింది. తమ యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరిందని వాట్సప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

యెమెన్‌లో కేరళ నర్సుకు నిరాశ

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతిని ఖండించిన మోదీ

భారత్‌తో ఒప్పందాలు అప్పుడే..! కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

చైనాలో భారీ అగ్ని ప్రమాదం

Chandrayaan-3: ఆ శకలంతో ఎటువంటి ప్రమాదం లేదు: ఇస్రో