More

పారాచూట్‌తో ప్లేన్ జంప్ చేసింది..!

12 May, 2014 02:37 IST
పారాచూట్‌తో ప్లేన్ జంప్ చేసింది..!

విమానం ఇంజిన్ ఫెయిలైంది. అందులో ఉండేవారు ఏం  చేస్తారు.. పారాచూట్ వేసుకుని జంప్ చేస్తారు. కానీ ఇక్కడ ఏకంగా ప్లేనే.. పారాచూట్ వేసుకుని.. జంప్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్న సీన్ ఇదే. ఇటీవల ఆస్ట్రేలియాలోని లాసన్ పట్టణంలో జనమంతా ఈ ఘటనను నోరెళ్లబెట్టి చూశారు. సైర్రస్ అనే ఈ తేలికపాటి విమానం భూమికి 4 వేల అడుగుల ఎత్తులో విహరిస్తున్నప్పుడు ఇంజిన్ చెడిపోయింది.

దీంతో విమానంలో ఉండే పారాచూట్ వ్యవస్థను పైలట్ వినియోగించుకున్నాడు. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురిని సురక్షితంగా కిందకు దించాడు. తమ విమానంలో ఉన్న ఈ పారాచూట్ వ్యవస్థ ద్వారా చాలా మంది ప్రాణాలు దక్కించుకున్నారని సైర్రస్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఉక్రెయిన్‌పై రష్యా అతి పెద్ద  డ్రోన్‌ ఎటాక్‌, ఏకంగా 75 డ్రోన్లతో

శాండ్‌ విచ్‌ తిని, రూ. 6 లక్షల టిప్‌ ఇచ్చేసింది..!

సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్‌!

బుర్జ్‌ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..

సుందర్‌ పిచాయ్‌పై గూగుల్‌ మాజీ ఉద్యోగి ఘాటు వ్యాఖ్యలు