More

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు

20 Mar, 2020 05:32 IST

న్యూఢిల్లీ‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలు చేశారు. దోషులుగా తేలిన ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహార్‌ జైలులో శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీశారు. జైలు అధికారుల సమక్షంలో మీరట్‌ నుంచి వచ్చిన తలారి పవన్‌.. మనీలా తాళ్లతో ఉరి తీశారు. దక్షిణాసియాలోనే అతి పెద్దదైన తీహార్‌ కేంద్ర కారాగారంలో ఒకే నేరానికి సంబంధించి నలుగురిని ఉరి తీయడం ఇదే మొదటిసారి. ఉరిశిక్షను తప్పించుకునేందుకు చివరి వరకు దోషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. నిర్భయ దోషులకు ఇక ఎటువంటి చట్టపరమైన అవకాశాలు మిగిలిలేవని ఢిల్లీ కోర్టు గురువారం స్పష్టం చేయడంతో ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు చేశారు. దోషులను ఉరి తీయడంపై నిర్భయ తల్లిదండ్రులు హర్షం ప్రకటించారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని వ్యాఖ్యానించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(నిర్భయ దోషులను ఎలా ఉరి తీస్తారో తెలుసా?)

(నా కూతురి ఆత్మకు శాంతి లభిస్తుంది!)

(‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’)

(ఆఖరి ప్రయత్నం విఫలం; ఇక ఉరే)
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’

మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..

మ్యాచ్‌ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ

Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం

నేరగాళ్ల చేతుల్లోకి కృత్రిమ మేధ