More

నష్టం..రూ.7కోట్లు

11 May, 2014 00:24 IST
నష్టం..రూ.7కోట్లు

 నల్లగొండ, న్యూస్‌లైన్ : అకాల వర్షాల కారణంగా జిల్లాలో భారీ నష్టమే వాటిల్లింది.  కొద్ది రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాల వల్ల 1520 హెక్టార్లలో వరి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీంతో రైతాంగానికి సుమారు రూ.7కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శుక్రవారం కురిసిన వర్షానికే 340 హెక్టార్లలో చేతికొచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దీంతోపాటు ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లలో నిల్వ ఉంచిన ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. దీని వల్ల ఇటు రైతాంగానికి, కొనుగోలు చేసిన మహిళా సంఘాలకు నష్టం రాకుండా ఉండేందుకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని జిల్లా వ్యవసాయ శాఖ తెలిపింది.  
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

వరల్డ్‌కప్‌ ఫీవర్‌.. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఎల్‌ఈడీ స్క్రీన్‌..

వోటథాన్ యాప్‌ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్‌ కూడా..

బండి సంజయ్ వర్సెస్‌ గంగుల కమలాకర్‌

బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌.. సీనియర్లకు ఇద్దరు మహిళలు షాకిచ్చేనా?

కేసీఆర్‌,కేటీఆర్‌కు ఉద్యోగాలివ్వకండి: ప్రియాంక గాంధీ