More

యువ రైతు బలవన్మరణం

12 Nov, 2015 16:43 IST

అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూనెం పుల్లయ్య(27) రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 8 ఎకరాల్లో పత్తి  పంట వేశాడు.  అయితే, పూత కాయ సరిగా లేకపోవటంతో దిగుబడి ఆశించినంత రాలేదు. సాగు కోసం చేసిన రూ.2.50 లక్షలను తీర్చేదారి తెలియక తీవ్ర ఆందోళన చెందిన పుల్లయ్య గురువారం ఉదయం చేనులోనే పురుగు మందు తాగాడు. కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుంగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అతనికి భార్య ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.



 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

‘తల్లీ.. మీ మాట వినడానికే వచ్చాను’

మోదీ ఆలింగనం.. మందకృష్ణ కంటతడి

కరెంట్‌ కావాలా? కాంగ్రెస్‌ కావాలా?: కేటీఆర్‌

ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే కమిటీ: ప్రధాని మోదీ

అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ