More

పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని..

27 Dec, 2022 07:45 IST
ప్రతీకాత్మక చిత్రం

తుమకూరు(కర్ణాటక): తుమకూరు విశ్వ విద్యాలయంలోని కన్నడ విభాగంలోని పీహెచ్‌డీ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు కామాంధుని అవతారమెత్తాడు. నిందితుడు మల్లికార్జున, 17 ఏళ్ల బాలికను లోబర్చుకుని గర్భవతిని చేశాడు. దీంతో ఆమె మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతని బండారం బయటపడింది. వివరాలు... మల్లికార్జున తుమకూరు వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ నగరంలో బాడుగ ఇంటిలో ఉంటున్నాడు.

ఐదుమంది ఆడపిల్లలు ఉన్న కుటుంబంలోని ఒక బాలిక ఇతని ఇంట్లో అంట్లు తోమడానికి వచ్చేది. ఆ బాలికకు ప్రేమ అని మాయమాటలు చెప్పి వాంఛలు తీర్చుకునేవాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భవతైంది. ఈ విషయాన్ని మూసివేయడానికి నిందితుడు అనేక ప్రయత్నాలు చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పరారయ్యాడు. 15 రోజుల నుంచి వర్సిటీకి కూడా రావడం లేదు. పోలీసులు నిక్కచ్చిగా దర్యాప్తు చేసి నిందితున్ని శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.
చదవండి: దారుణం.. టీ పెట్టలేదని భార్యను చపాతీ పీటతో కొట్టి చంపిన భర్త  

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

మణిపూర్‌ హింస కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

కారులో డబ్బుల సంచులు.. సీఐపై కాంగ్రెస్‌ నేత దాడి!

అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై

చంద్రబాబు కేసు.. సీఐడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ

కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన