More

ఇరాన్‌లో మాజీ అధికారికి ఉరి

15 Jan, 2023 06:26 IST

దుబాయ్‌: బ్రిటన్‌ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్‌ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్‌–ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్‌ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది.

ఇరాన్‌ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్‌ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

హమాస్ సొరంగాలకు కృత్రిమ వరద..?

26/11 కుట్రదారుడు సాజిద్‌ మీర్‌పై విష ప్రయోగం!

యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..

70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు

క్రౌన్‌ ప్లాజాలో ఘనంగా 'మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌' సమావేశం