More

Money Laundering Case: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను విచారించిన ఈడీ

30 Aug, 2021 18:27 IST

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించింది.  మనీ లాండరింగ్‌ కేసుతో పాటు, ఎన్నికల కమిషన్‌తో సంబంధం ఉన్న లంచం కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసు విషయమై సోమవారం ఫెర్నాండెజ్ విచారించిన ఈడీ.. పలు అంశాలపై ఆరా తీసింది. 

సుకేశ్ చంద్రశేఖర్ కేసులో కేవలం సాక్షిగా మాత్రమే ఆమెను విచారించినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆగస్టు 24న, చంద్రశేఖర్‌కు చెన్నైలో ఉన్న ఓ బంగ్లాను, 82.5 లక్షల నగదు, డజనుకు పైగా విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నేరపూరిత కుట్ర, మోసం,  దాదాపు 200 కోట్ల రూపాయల మేరకు దోపిడీకి సంబంధించి ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ కేసు నమోదైనట్లు తెలిపారు.  కాగా ప్రస్తుతం చంద్రశేఖర్‌ని రోహిణి జైలులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

చదవండి: Payel Sarkar: నటికి ఫేక్‌ డైరెక్టర్‌ అసభ్య సందేశాలు

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

క్రికెట్ వరల్డ్‌కప్‌పై సాంగ్స్.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏది బెస్ట్ అంటే?

పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!

మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!

బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌.. నో ఎలిమినేషన్‌

వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!