More

ప్రేమ వ్యవహారం: టీవీ నటితో వాగ్వాదం.. ముగ్గురి అరెస్టు 

21 Apr, 2021 06:51 IST

తిరువొత్తియూరు: ప్రేమ వ్యవహారానికి సంబంధించి టీవీ నటితో గొడవ చేసిన సహాయ దర్శకుడితో పాటు ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెన్నై మనలి బాలాజీ పాలయానికి చెందిన జెనీఫర్‌ (24) బుల్లితెర నటి. 2019లో జెనీఫర్‌కు శరవణన్‌తో వివాహమైంది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. విడాకుల పిటిషన్‌ కోర్టులో నడుస్తోంది.

ఈ క్రమంలో టీవీ సీరియల్‌లో సహాయ డైరక్టర్‌గా పని చేస్తున్న నవీన్‌కుమార్‌ (25)తో జెనిఫర్‌కు పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. జెనిఫర్‌కు వివాహమైన సంగతి నవీన్‌కుమార్‌కు తెలిసింది. దీంతో అతను ఆమెను నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నవీన్‌కుమార్, అతని స్నేహితులు జెనీఫర్‌ ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో  పోలీసులు నవీన్‌కుమార్,  పాండియన్‌ (24), కార్తికేయన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: భార్గవ్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేదు : ఓమైగాడ్‌ నిత్య

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

Spark Review: 'స్పార్క్' సినిమా రివ్యూ

Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?

నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్

'ఇప్పుడు యూత్ అంతా జియో , ఓయో మీదే న‌డుస్తోంది'

నెలన్నర నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో ఆ థ్రిల్లర్ మూవీ