More

Bengal E-Rickshaw Driver Gives Free Rides : జనరల్‌నాలెడ్జ్‌ ఉంటే చాలు... ఈ ఆటోలో ఫ్రీగా వెళ్లిపోగలం!!

22 Nov, 2021 18:37 IST

Bengal E-Rickshaw Driver Gives Free Rides: కొన్ని కొన్ని విషయాలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా ఇలాంటి వాళ్లు కూడా ఉన్నారా అని అనిపించక మానదు. అచ్చం అలానే ఇక్కడొక ఆటోవాలా తన వింతైన తీరుతో అందరి మనసులు దోచుకున్నాడు.

(చదవండి: కారు డ్రైవింగ్‌ చేస్తూ.. స్పృహ తప్పి పడిపోయింది! అతని సాహసానికి హ్యాట్సాఫ్‌)

అసలు విషయంలోకెళ్లితే...బెంగాల్‌లోని లిలుహ్ (హౌరా జిల్లా)లోని ఈ రిక్షా డ్రైవర్‌ సురంజన్ కర్మాకర్ ప్రయాణికులను తాను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తే ఉచితంగా డ్రాప్‌ చేస్తానంటూ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఒక జంట సంకలన్ సర్కార్ అతని భార్య ఇద్దరూ సురంజన్‌ ఆటో ఎక్కుతారు. సురంజన్‌ వెంటనే తానడిగే 15 జీకే ప్రశ్నలకు జవాబు చెబితే మిమ్మల్ని ఉచితంగా తీసుకువెళ్తానంటాడు. దీంతో ఆ జంట ఆ డ్రైవర్‌ సురంజన్‌ తీరు చూసి ఒక్కసారిగా షాక్‌కి గురువుతారు. అయితే ఆ జంట అతని ప్రశ్నలేంటో తెలుసుకుందామనే ఆసక్తితో  అతని ఆటో ఎక్కుతారు.

ఆ తర్వాత సురంజన్‌ ప్రశ్నల పరంపర చాలా రసవత్తరంగా సాగుతుంటుంది. అతను జీకేలో అన్నింటిని టచ్‌ చేసుకుంటూ వెళ్లిపోతాడు. అయితే ప్రయాణికుడు సంకలన్‌ మొదటగా ఈ డ్రైవర్‌ తన సంపాదనతో సంతృప్తి చెందక ఇలా ప్రయాణికులను ప్రశ్నలడిగి ఒకవేళ వాళ్లు సరైన సమాధానం చెప్పకపోతే అధిక చార్జీలు వసూలు చేద్దాం అని ఇలా చేస్తున్నాడు అనుకుంటాడు. అయితే ఈ క్విజ్‌ అయిపోయిన వెంటనే డ్రైవర్‌ సురంజన్‌ మాట్లాడుతూ... "ఆర్థిక ఇబ్బందుల కారణంగా నేను ఆరవ తరగతి వరకు చదువుకున్నాను. అయితే నాకు ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల వరకు చదివే అలవాటు ఉంది. అంతేకాదు లిలూయా బుక్ ఫెయిర్ ఫౌండేషన్‌లో సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను గూగుల్‌లో 'అద్భుత్ తోటివాలా'గా కూడా చూడవచ్చు" అని అన్నాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌! ఇక సైబర్‌ కేటుగాళ్ల ఆటకట్టు..)

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

ఇక కౌంటింగ్‌కి రెడీ.. నాయకులకు పార్టీల ట్రైనింగ్‌

ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌కు ఇదే చివరి తేది!

అలిగిన గ్రామీణం.. ఎన్నికల బహిష్కరణ మంత్రం

ఎంత చెబుతున్నా వినరు.. ఆసక్తికర గణాంకాలు!

బతికే ఉన్నా మహా ప్రభో...దీనానాథ్ దీన గాథ!