More

IND Vs ENG: నన్ను ఎందుకు ఆడించలేదంటే...

21 Aug, 2021 01:56 IST

రెండో టెస్టుపై అశ్విన్‌ వివరణ

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు నలుగురు పేసర్లతో ఆడింది. రెండో టెస్టుకు వచ్చే సరికి శార్దుల్‌ గాయపడగా, అతని స్థానంలో స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు అవకాశం దక్కవచ్చని అంతా భావించారు. కానీ ఈ సారి కూడా అదే నలుగురు పేసర్లు వ్యూహాన్ని టీమిండియా అనుసరించింది. అయితే అశ్విన్‌ను ఆడించేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ దాదాపుగా సిద్ధపడగా...ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అతడిని పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని అశ్విన్‌ స్వయంగా వెల్లడించాడు. టీమ్‌ ఫీల్డింగ్‌ కోచ్‌  ఆర్‌.శ్రీధర్‌తో అతను దీనిని పంచుకున్నాడు. ‘మ్యాచ్‌ జరిగే రోజుల్లో ముందస్తు వాతావరణ సూచన చూస్తే బాగా ఎండ కాస్తుందని, వేడి గాలులు వీస్తాయని ఉంది. మ్యాచ్‌ ఆడేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అని నాతో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పింది కూడా. అయితే మ్యాచ్‌ రోజు మేం బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా చల్లగా మారిపోయి చినుకులు కురుస్తున్నాయి. దాంతో నాకు చోటు దక్కలేదు. వాతావరణం మన చేతుల్లో లేదు కదా’ అని అశ్విన్‌ వెల్లడించాడు.

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC: 2003లో ఓడిపోయాం.. కానీ ఈసారి ట్రోఫీ మనదే: అజారుద్దీన్‌

Hyd: షమీ మెరుపులు.. కోహ్లి, గిల్, రోహిత్ హిట్టింగ్‌ చూడాలని ఆశ

చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్‌ గిల్! సచిన్‌ వరల్డ్‌ రికార్డుపై కన్ను

అతడే మాకు సవాల్‌.. స్టేడియాన్ని నిశ్శబ్దంగా మార్చడమే లక్ష్యం: ఆసీస్‌ కెప్టెన్‌

సూర్యకుమార్‌ ఔట్‌.. అశ్విన్‌ ఇన్‌? క్లారిటీ ఇచ్చిన రోహిత్‌ శర్మ