More

Euro Cup: 55 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు ఇంగ్లండ్‌

8 Jul, 2021 07:40 IST

లండన్‌: యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్‌ తర్వాత ఒక మేజర్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆట 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు మిక్కెల్‌ డ్యామ్స్‌గార్డ్‌ ఫెనాల్టీ కిక్‌ను అద్బుతమైన గోల్‌గా మలిచాడు.

అయితే డెన్మార్క్‌ ఆటగాళ్ల తప్పిదంతో ఇంగ్లండ్‌ కూడా కాసేపటికే ఖాతా తెరిచింది. మ్యాచ్‌ ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో ఆట అదనపు సమయానికి వెళ్లింది. అయితే అదనపు సమయం అవకాశాన్ని ఇంగ్లండ్‌ అద్భుతంగా ఉపయోగించుకుంది. ఆ జట్టు ఆటగాడు హారీ కేన్‌ ఫెనాల్టీ కిక్‌ను అద్బుత గోల్‌గా మలవడంతో ఇంగ్లండ్‌ ఆధిక్యంలోకి వెళ్లగా.. అదనపు సమయం ముగిసేలోపు డెన్మార్క్‌ మరో గోల్‌ చేయడంలో విఫలమైంది. దీంతో ఇంగ్లండ్‌ యూరోకప్‌లో ఫైనల్‌ చేరింది. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

CWC 2023: శ్రేయస్‌-రాహుల్‌.. జోడీ నంబర్‌ వన్‌

11 ఏళ్ల తర్వాత వికెట్‌ తీసిన హిట్‌మ్యాన్‌.. ఇదే మ్యాచ్‌లో కోహ్లి కూడా..!

టీమిండియాను ఓడించడం​ చాలా కష్టం: నెదర్లాండ్స్‌ కెప్టెన్‌

మా విజయ రహస్యం అదే.. నెదర్లాండ్స్‌పై విజయానంతరం రోహిత్‌ శర్మ

కేఎల్‌ రాహుల్‌ సుడిగాలి శతకం.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌