సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ కేటగిరీ–4 విజేతలు వీరే

2 Apr, 2018 04:00 IST|Sakshi
సాక్షి ఇండియా స్పెల్‌బీ విజేతలు

హైదరాబాద్ ‌: ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్‌బీ, మ్యాథ్‌బీ–2017 (కేటగిరీ–4, తెలంగాణ రాష్ట్రం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్‌ భాషపై, మ్యాథ్స్‌ విషయంలో అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడంతో పాటు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.

స్పెల్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని నీరజ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదువుతున్న ఎస్‌. ఉదయశ్రీ కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ప్రథమ బహుమతి: హైదరాబాద్‌లోని వికాస్‌ ది కాన్సెప్ట్‌ స్కూల్‌ బాచుపల్లిలో చదువుతున్న సాయి శ్రీరామ్‌ కార్తీక్‌ బి కైవసం చేసుకున్నారు. విజేతకు బంగారు పతకంతో పాటు రూ. 15వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ ద్వితీయ బహుమతి:  హైదరాబాద్‌లోని గీతాంజలి దేవశాలలో చదువుతున్న మ్రినల్‌ కుటేరి కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ ద్వితీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చదువుతున్న ఆశ్రిత్‌ రెడ్డి బిరదవోలు కైవసం చేసుకున్నారు. విజేతకు రజత పతకంతో పాటు రూ. 10వేలు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిప్ట్‌ హాంపర్‌ అందజేశారు.

స్పెల్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్, జూబ్లీహిల్స్‌లో చదువుతున్న వి. కృష్ణ సాయి గాయిత్రి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు.

మ్యాథ్‌బీ తృతీయ బహుమతి: హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, నాచారం బ్రాంచ్‌లో చదువుతున్న కావేరి ప్రియా పుట్టి కైవసం చేసుకున్నారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ. 5,000లు, సర్టిఫికెట్, డ్యూక్‌ గిఫ్ట్‌ హాంపర్‌ అందజేశారు. 

మరిన్ని వార్తలు