వైఎస్‌ జగన్‌ను కలిసిన 104 ఉద్యోగులు

16 Jul, 2018 11:47 IST|Sakshi

సాక్షి, అనపర్తి : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనపర్తి నియోజకవర్గంలోని పెద్దాడ చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, పార్టీ నేతల నుంచి ఘనస్వాగతం లభించింది. పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను రాజన్న బిడ్డతో ఏకరవు పెట్టుకున్నారు. అందరికి న్యాయం చేస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది తమ గోడు వెల్లబోసుకున్నారు. చంద్రబాబు హయాంలో ప్రవేటు సంస్థలోకి వెళ్లిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెరిగేల చూడాలని కోరారు. వారి సమస్యలను విన్న ఆయన తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!