11 మంది బాలికలపై లైంగిక దాడి

4 Jan, 2014 08:22 IST|Sakshi
11 మంది బాలికలపై లైంగిక దాడి

*ట్యూషన్ మాస్టర్ దురాగతం
*నల్లగొండ జిల్లాలోని ఓ ఆశ్రమంలో దారుణం
 
నల్గొండ: అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు ఉన్న 11 మంది బాలికలపై మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడో మానవమృగం. వివరాల్లోకి వెడితే.. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని  తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఉంటూ, 78 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. అందులో సగం మంది బాలికలు ఉన్నారు. ఇదే ఆశ్రమంలో ట్యూషన్ చెప్పేందుకు సదరు సంస్థ యాజమాన్యం  రమావత్ హరీష్‌ను ట్యూషన్ మాస్టర్‌గా తీసుకుంది.
 
 ఇంటర్ ఫెయిల్ అయిన ఇతడికి నెలకు మూడు వేలరూపాయలు జీతంగా ఇస్తోంది. ఉదయం ఆరు నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు విద్యార్థులకు హరీష్ ట్యూషన్ చెప్పేవాడు. ఇదే క్రమంలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థినులను బెదిరించి  మూడు మాసాలుగా 11 మందిపై లైంగికదాడి చేశాడు. 

ఈ విషయమై ఓ విద్యార్థిని ఆశ్రమం నిర్వాహకుడు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లింది. ఆయన వెంటనే  ఈ విషయాన్ని సంస్థ నిర్వాహకులకు తెలియజేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.  వెంటనే స్పందించిన సీఐ ఆనందరెడ్డి శుక్రవారం రాత్రి ఆశ్రవూనికి చేరుకుని విచారణ చేపట్టారు.


మరోవైపు బాలికలపై లైంగిక దాడిని నిరసిస్తూ విద్యార్థి గిరిజన సంఘాలు శనివారం జిల్లా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు