రాష్ట్రంలో 15 పథకాల ఫార్ములా

2 Nov, 2016 01:28 IST|Sakshi
రాష్ట్రంలో 15 పథకాల ఫార్ములా

ఒంగోలు పర్యటనలో సీఎం చంద్రబాబు

 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్రంలో 15 పథకాల ఫార్ములాను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పెన్షన్లు మొదలుకొని పక్కా గృహాలు, 5 కిలోల బియ్యం, చంద్రన్న బీమా, వంట గ్యాస్, ఇంటింటికీ మరుగుదొడ్లు తదితర 15 పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెలనెలా ప్రతి ఇంటికి రూ.10 వేలు ఆదాయం వచ్చేలా చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఒంగోలులో పర్యటించిన సీఎం ఒంగోలులోని కొప్పోలు గాంధీనగర్ ఎస్సీ కాలనీలో జరిగిన జనచైతన్యయాత్రలో పాల్గొన్నారు.

అనంతరం ఒంగోలు మినీస్టేడియంలో జరిగిన డ్వాక్రా సంఘాల సమావేశానికి హాజరై మాట్లాడారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 వేల పెట్టుబడి నిధి ఇస్తున్నట్లు చెప్పారు.  డ్వాక్రా సంఘాలను నడిపిస్తున్న సెర్ఫ్ ఉద్యోగులకు అదనంగా 35 శాతం జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంత్రులు రావెల, శిద్దా, బుచ్చయ్యచౌదరి, కరణం బలరాం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు