4 ప్రత్యేక రైళ్లకు పచ్చజెండా

23 Sep, 2013 03:16 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖపట్నం మీ దుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు తూర్పు కోస్తా రైల్వే పచ్చజెండా ఊపింది. గువహటి-సికింద్రాబాద్, హైదరాబాద్-షాలిమా ర్, షాలిమార్-యశ్వంత్‌పూర్, సాం త్రగచ్చి-కొచివేలి వంటి ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే నడుస్తున్న విశాఖ-కొల్లాం(కేరళ) రైలును మరో రెండు మాసాల వరకూ పొడి గిస్తూ ఆదివారం ప్రకటన జారీ చేసింది. కొల్లాం రైలు పొడిగింపుతో అయ్యప్ప భక్తుల ప్రయాణ సమస్యలు దాదాపు తీరినట్టేనని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొల్లాం రైలును సెప్టెంబర్ నెల వరకూ మాత్రమే ప్రకటించిన రైల్వే తాజాగా అక్టోబర్, నవంబర్ మాసాల చివరి వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రయాణికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తం 17 బోగీలుండే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ చెరోబోగీతో బాటు 7 స్లీపర్  క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలుంటాయి.

 రైలు నంబర్ 08569 విశాఖపట్నం-కొల్లాం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 3 నుంచి నవంబర్ 28వ తేదీ వరకూ(మొత్తం 16 ట్రిప్పులు) ప్రతి ఆది, గురువారాల్లో ఉదయం 9 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గూడూరు, కాట్పడి, జోలార్‌పేటయ్, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కాడ్, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం మీదుగా కొల్లాంకు ఆ మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడకు మధ్యాహ్నం 2.50 గంటలకు, గూడూరుకు రాత్రి 8.28 గంటలకు, కోయంబత్తూర్‌కు ఆ మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు చేరుతుంది.

 రైలు నంబర్ 08570 కొల్లాం-విశాఖపట్నం బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ ప్రతి సోమ, శుక్రవారాల్లో రాత్రి 9 గంటలకు కొల్లాంలో బయల్దేరుతుంది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు కోయంబత్తూర్ చేరుకునే ఈ రైలు గూడూరు స్టేషన్‌కు ఉదయం 14.50 గంటలకు, విజయవాడకు రాత్రి 7.10 గంటలకు, చేరుకునే ఈ రైలు అర్థరాత్రి 1.25 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుతుంది.

 గువహటి-సికింద్రాబాద్ మధ్య 9 ట్రి ప్పులు

 రైలు నంబర్ 07149 సికింద్రాబాద్-గువహటి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్‌లో ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖలో రాత్రి 8.20 గంటలకు బయల్దేరి ఆదివారం ఉదయం 7.55 గంటలకు గువహటి చేరుకుంటుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 29వ తేదీ వరకూ 9 ట్రిప్పులు నడుస్తుంది.

 రైలు నంబర్ 07150 గువహటి-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు గువహటిలో బయల్దేరి మంగళవారం రాత్రి 7.40 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి బుధవారం ఉదయం 9.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. అక్టోబర్ 7 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైలు విశాఖ మీదుగా పరుగులు తీస్తుంది. దువ్వాడ, విశాఖ, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్‌లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 8 స్లీపర్‌క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి.

 హైదరాబాద్ -షాలిమర్ మధ్య సూపర్‌ఫాస్ట్

 రైలు నంబర్ 07128 స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకూ ప్రతి ఆదివారం రాత్రి 9.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.25 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖ నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటలకు బయల్దేరి మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది.

 తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07127 షాలిమర్-హైదరాబాద్ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ ప్రతి మంగళవారం ఉదయం 11.05 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 1.30 గంటలకు విశాఖకు చేరుతుంది. విశాఖ నుంచి ప్రతి బుధవారం తెల్లవారుజామున 1.50 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపురం, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్, భద్రక్ స్టేషన్‌లలో ఆగే ఈ రైలులో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ చెరో బోగీతో బాటు 10 స్లీపర్‌క్లాస్ బోగీలు, 4 జనరల్ బోగీలుంటాయి.
 
యశ్వంత్‌పూర్‌కు స్పెషల్

 యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే ఉంటాయి. అందుకే దసరా సీజన్‌లో మరో ప్రత్యేక రైలును ఈ మార్గంలో నడుపుతున్నారు. షాలిమర్ నుంచి యశ్వంత్‌పూర్ మధ్య ఈ ప్రత్యేక రైలు 8 ట్రిప్పులు నడుస్తుంది. విశాఖకు రాకుండానే ఈ రైలు దువ్వాడ మీదుగా ప్రయాణిస్తుంది. ఈస్టుకోస్టు రైల్వే పరిధిలోని దువ్వాడ, విజయనగరం, బరంపూర్, కుర్దారోడ్, భువరనేశ్వర్, కటక్, భద్రక్ స్టేషన్‌ల మీదుగా ప్రయాణించే ఈ రైలులో ఫస్టు, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో బాటు 11 స్లీపర్ క్లాస్ బోగీలుంటాయి. జనరల్ బోగీలు ఈ రైల్లో ఉండవు.

 రైలు నంబర్ 02863 షాలిమర్-యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్7 వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ  ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి అదే రోజు రాత్రి 11.43 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరుతుంది. రెండు నిమిషాల హాల్టు అనంతరం బయల్దేరి మంగళవారం సాయంత్రం 4 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుంటుంది.

 రైలు నంబర్ 02864 యశ్వంత్ పూర్-షాలిమర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 27వ తేదీ వరకూ ప్రతి బుధవారం ఉదయం 11.15 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి ప్రతి గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. తిరిగి దువ్వాడలో 3.32 గంటలకు బయల్దేరి ప్రతి గురువారం సాయంత్రం 4.20 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది.

 సాంత్రగచ్చి(హౌరా) నుంచి కేరళకు మరో స్పెషల్

 కేరళలోని త్రివేండ్రం సమీపంలో ఉన్న కొచువేలి స్టేషన్ నుం చి హౌరా దరి సాంత్రగచ్చి స్టేషన్‌కు మరో ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఈ రైలు విశాఖ మీదుగా ప్రయాణిస్తుంది.

 రైలు నంబర్ 02851 సాంత్రగచ్చి-కొచువేలి స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకూ ప్రతి శనివారం సాయంత్రం 4.05 గంటలకు సాంత్రగచ్చిలో బయల్దేరి ఆదివారం తెల్లవారు జామున 4.40గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరుకుంటుంది. విశాఖలో తెల్లవారు జామున 5 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 10.30 గంటలకు కొచువేలి చేరుకుంటుంది.

 రైలు నంబర్ 02852 కొచువేలి నుంచి హౌరా స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 8 నుంచి డిసెంబర్ 3వ తేదీ మధ్య ప్రతి మంగళవారం తెల్లవారుజామున 4.15 గంటలకు కొచువేలిలో బయల్దేరి బుధవారం మధ్యాహ్నం 11.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. విశాఖలో 11.35 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సాంత్రగచ్చి చేరుతుంది. ఈ రైలులో రెండు థర్డ్ ఏసీ, 8 స్లీపర్ క్లాస్ బోగీలు, 6 జనరల్ బోగీలుంటాయి.
 

మరిన్ని వార్తలు